ETV Bharat / state

భీమవరంలో అక్రమ మద్యం పట్టివేత.. కానిస్టేబుల్ అరెస్ట్ - భీమవరంలో అక్రమ మద్యం వార్తలు

అక్రమంగా మద్యం సీసాలను తరలిస్తూ ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా భీమవరం టోల్​గేట్ వద్ద జరిగింది.

constable take over  illigal liquor  at bhemavaram
భీమవరంలో అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Nov 9, 2020, 8:09 PM IST

కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని భీమవరం టోల్​గేట్ వద్ద జరిగింది. ముందస్తు సమాచారంతో వత్సవాయి ఎస్ఐ సోమేశ్వర రావు సిబ్బందితో కలిసి భీమవరం టోల్​గేట్ వద్ద కారును సోదా చేశారు. మద్దిరాల పెద్దశీను అనే కానిస్టేబుల్ 264 మద్యం సీసాలను ఇండికా కారులో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్టణంలో కొనుగోలు చేసి నందిగామకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

ఇదీ చూడండి. స్మగ్లర్ బాషాభాయ్​ వారితో టచ్​లో ఉన్నాడు: ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.