నూతన వ్యవసాయ బిల్లులు.. రైతుల పాలిట ఉరితాళ్లుగా మారడం తథ్యమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ నరహరిశెట్టి నరసింహారావు విమర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో నియోజకవర్గ బాధ్యులు బొర్రా కిరణ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రంలోని అధికార భాజపా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నరసింహారావు వ్యతిరేకించారు. అన్నదాతను నట్టేట ముంచే జీవోలను రద్దు చేయాలంటూ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: