రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లోని కాపు మహిళలకు... కాపు నేస్తం పథకం ఎందుకు వర్తింపచేయరని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు చేపట్టిన ఈ పథకాన్ని... 13 జిల్లాల్లో అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలో అర్హులైనవారు ఒక్కరైనా లేకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వం తక్షణమే రాయలసీమ జిల్లాల్లో రీసర్వే చేయించి అర్హులకు కాపునేస్తం పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: