ETV Bharat / state

హైకోర్టు న్యాయవాదుల సమావేశం రసాభాస

author img

By

Published : Apr 9, 2021, 10:18 AM IST

హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. బార్‌కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో.. న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు ఘర్షణకు దారితీశాయి. కుర్చీలతో న్యాయవాదులు ఘర్షణకు దిగారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌ తలకు గాయమైంది.

హైకోర్టు న్యాయవాదుల సమావేశం రసాభాస
హైకోర్టు న్యాయవాదుల సమావేశం రసాభాస

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం రసాభాస అయ్యింది. గురువారం నిర్వహించిన ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన కొందరు న్యాయవాదులు అజెండా ప్రతుల్ని చించేసి, కుర్చీలు విసిరేశారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, న్యాయవాది చలసాని అజయ్‌కుమార్‌ తలకు కుర్చీ తగిలి గాయమైంది. దీంతో కొందరు న్యాయవాదులతో కలిసి అజయ్‌కుమార్‌ నినాదాలు చేసుకుంటూ వెళ్లి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామిని కలిసి దాడి గురించి వివరించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడు, ఇతరులు సమర్పించిన రాజీనామాలను ఆమోదించడంపై చర్చించేందుకు గురువారం సాయంత్రం హైకోర్టు క్యాంటీన్‌ వద్ద సమావేశం ఏర్పాటుచేశారు. కొందరు న్యాయవాదులు సమావేశానికి ఎవరు అనుమతిచ్చారని ప్రశ్నిస్తూ టెంట్లను తొలగించారు. సమావేశానికి సీజే అనుమతి ఉందని నిర్వాహకులు చెప్పారు. ఈ సమయంలోనే గొడవ జరిగింది.

సీజే అనుమతి ఉంది: అజయ్‌కుమార్‌

సీజేను కలిసి వచ్చిన తర్వాత అజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘సమావేశానికి సీజే అనుమతి ఇచ్చారు. సమావేశం గురించి ఏజీకి తెలుసు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరగా, సరేనన్నారు. సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన వారిలో ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) ఉన్నారు. వారికి ప్రభుత్వం ఏమైనా సూచన చేసిందో, మరి ఎవరు సూచన చేశారో తెలీదుకానీ దూసుకొచ్చి కుర్చీలతో కొట్టారు. నా తలకు తగిలి గాయమైంది. దాడి చేసిన విషయాన్ని సీజే దృష్టికి తీసుకెళ్లగా.. హైకోర్టు హుందాతనాన్ని కాపాడాలన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సమావేశం విజయవంతంగా ముగిసింది. తీర్మానాలను ఆమోదించాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.