ETV Bharat / state

కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యంతో ప్రజల్లో ఆందోళన

కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో ఆలస్యం..అనుమానిత లక్షణాలున్నవారిని కలవరపెడుతోంది. నమూనాలిచ్చి ఏడెనిమిది రోజులైనా.... ఫలితాలు నిర్ధరణ కాకపోవడం.. ఆందోళన పెంచుతోంది. ఈలోగా... పరీక్షలు చేయించుకున్నవారిలో చాలా మంది బయట తిరుగుతూ.... వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు.

కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యంతో ప్రజల్లో ఆందోళన
కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యంతో ప్రజల్లో ఆందోళన
author img

By

Published : Apr 27, 2021, 3:28 AM IST

Updated : Apr 27, 2021, 4:56 AM IST

కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో తీవ్ర జాప్యంతో ప్రజల్లో ఆందోళన

వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో.... కొవిడ్‌ పరీక్షల వెల్లడిలో ఆలస్యం.. ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోంది. నమూనాలిచ్చి వారం రోజులవుతున్నా... ఫలితాలు తెలియకపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ముఖ్యంగా రోజుకు వేయికిపైగా కేసులు నమోదవుతున్న చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిత్తూరు జిల్లాలో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా తిరుపతిలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ రోజుకు 5 నుంచి 6 వేల వరకూ నమూనాలు సేకరిస్తుండగా..ఫలితాలు వెల్లడిస్తున్న సంఖ్య మూడు వేల లోపే ఉంటోంది. దీని వల్ల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. ఈ ఆలస్యంతో... నమూనాలిచ్చిన వారు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు..తిరుపతిలోని జాతీయస్థాయి విద్యాసంస్థ ఐసర్ పరిశోధనశాలను కొవిడ్ పరీక్షల కోసం తీసుకున్నారు. వీలైనంత త్వరగా కొవిడ్‌ పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

గుంటూరు జిల్లాలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. జిల్లాలో రోజూ.. వెయ్యికి పైగా కేసులు వెలుగుచూస్తున్నా.. అందుకు తగ్గట్లుగా పరీక్షలు పెంచి ఫలితాలు ఇవ్వటం లేదు. నమూనాల సేకరణ ఎక్కువ కావడంతో రోజూ వేలాది పరిక్షలు పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 7 నుంచి 9 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ విధానంలో మాత్రమే పరిక్షలు చేయాలని ఆదేశించింది. దీని వల్ల ఫలితాల వెల్లడి బాగా ఆలస్యమవుతోంది. మొదట్లో కిట్ల కొరత ఎదురైంది. కిట్లు సమకూర్చుకున్న తర్వాత సిబ్బంది సమస్య వచ్చింది. అత్యవసరంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించటంతో ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇపుడిపుడే పరిక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన గాడిలో పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

కొవిడ్ మేనేజ్​మెంట్ కోసం మూడంచెల వ్యవస్థ: సీఎం జగన్

Last Updated : Apr 27, 2021, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.