అర్హులైన వారికి కాకుండా వైకాపా నేతలు చెప్పిన వారికే కర్నూలు జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ఆరోపించారు. పాణ్యం నియెజకవర్గంలోని బస్తిపాడు గ్రామంలో అనర్హులకు ఇళ్లపట్టాలను ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో గ్రామస్థులు.. కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబుకి ఫిర్యాదు చేశారు. బస్తిపాడు గ్రామంలో ఒకే ఇంటిలో ఐదుగురికి పట్టాలు ఇచ్చారని గౌరు చరితమ్మ తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతామన్నారు.
ఇదీ చదవండి