ETV Bharat / state

విధ్వంసంపైనే వైకాపా ప్రభుత్వం దృష్టంతా: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం దృష్టంతా విధ్వంసంపైనే ఉందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మూడు రాజధానుల కోసమే అమరావతి ఉద్యమానికి కుల ముద్ర వేశారని విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Aug 24, 2020, 6:13 PM IST

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలకు వైకాపా నమ్మకద్రోహం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. విధ్వంసంపైనే వైకాపా సర్కార్ దృష్టంతా ఉందని మండిపడ్డారు. మూడు ముక్కులాట ఆడే అధికారం వైకాపాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

రాజధాని తరలింపు విషయంపై ఎన్నికలకు వెళ్లమని సవాల్ విసిరితే స్వీకరించలేదు. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు సిద్ధమంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అమరావతి కోసం 87మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం లెక్కలేకుండా మానవత్వం, కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. రాజధానిని 3 ముక్కలు చేసేందుకు... 251 రోజుల అమరావతి ఉద్యమానికి కులం ముద్ర వేశారు- చంద్రబాబు, తెదేపా అధినేత

తక్షణమే పరిహారం చెల్లించండి

మరోవైపు వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల కుటుంబాలకు 10 వేల రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు భోజనాలు ఎక్కడా సరిగా అందించటం లేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు ఈ దుస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. వరద బాధితులకు హుద్ హుద్, తిత్లీ తుపాన్ సమయంలో ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

విజయనగరం గిరిజనుల ఆదర్శ'బాట'కు సోనూసూద్ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.