ETV Bharat / state

మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం

మీరు స్వచ్ఛమైన గాలి పీల్చుతున్నారా... చాలా మంది అవుననే అంటారు. కానీ కెనడా లాంటి దేశాలతో పోల్చితే మనం ఎంత అథమ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. ఆ దేశంలోని చెట్లు ఒక్కొక్కరికీ పంచితే ఒక వ్యక్తికి 9వేల చెట్లు వస్తాయి అక్కడ. ఇండియాలో ఆ సంఖ్య 28 మాత్రమే. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. అనే ప్రశ్నే వారిని కదిలించింది. పదిమందిలో ఆదర్శంగా నిలిపింది.

మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం
author img

By

Published : Apr 26, 2019, 7:28 AM IST

ప్రకృతిపై ప్రేమతో...చెట్లపై మమకారంతో... ప్రభుత్వ సహకారంతో ఉద్యానవనాలు పురుడు పోసుకుంటున్నాయి. వాటిని పెంచి పోషిస్తూ...వాటి మాధుర్యాన్ని అనుభవిస్తూ..భవిష్యత్​ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు...విజయవాడలోని టీచర్స్​ కాలనీవాసులు.
ఇక్కడ సాయంత్రం సరదాగా కుటుంబంతో కాలక్షేపం చేయొచ్చు. ఆహ్లాదకర వాతవరణాన్ని ఆస్వాదించొచ్చు. విసుగొస్తే స్నేహితులతో పిచ్చాపాటి తిరుగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. పిల్లలు..పెద్దలు అనే తేడా లేకుండాఈ ' టీచర్స్​ కాలనీ పార్కు'లో సేద తీరొచ్చు.

ఆరోగ్యం...ఆహ్లదం..కలిపేతే ఈ కాలనీపార్కు
పదేళ్ల క్రితం నగరపాలక సంస్థ నిధులతో ఏర్పాటైన ఈ ఉద్యానవనం..కాలనీవాసుల చొరవతో మరింత పచ్చదనం అద్దుకుంది. వ్యాహ్యళీ కోసం నడక మార్గాలు.. 300 రకాల మొక్కలు..తివాచీ లాంటీ పచ్చిక బయళ్లు, కూర్చొని ముచ్చటించటానికి బల్లలు ఇక్కడ కనిపిస్తాయి. వేడుక చేసుకోడానికి వీలుగా ఓ కమ్యూనిటీ హాలూ ఉంది. అన్ని సౌకర్యాలతో ఉన్న ఈ పార్కు ప్రకృతి ప్రియుల్ని రారమ్మని పిలుస్తోంది. ఆదర్శంగా నిలుస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలకు నీళ్లు పెట్టటం, గుబురుగా పెరిగిన గడ్డి తొలగించటం కోసం నగరపాలకు సంస్థ కార్మికులనూ నియమించింది. వారి శ్రమ, కాలనీ వాసుల శ్రద్ధ ఈ పార్కు కళకళలో కనిపిస్తోంది. మనసుకు ఉల్లసాన్నిస్తోంది.

ఇవీ చదవండి....అరకు లోయలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.