కరోనా నిబంధనల పట్ల విజయవాడ ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అదనపు బలగాలతో కవాతు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలను కలెక్టర్, సీపీ పరిశీలించారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆంక్షలు కఠినతరం: రంగంలోకి ప్రత్యేక బలగాలు