పుర ప్రాజెక్టు కింద మంజూరైన నిధులను కొండపల్లి పురపాలక సంఘానికి బదలాయించాలని కోరుతూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఇతర అధికారులతో కలిసి పురప్రాజెక్టు అమలుపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 11.54 కోట్లను ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద మంజూరు చేసిందని.. ఆ నిధులతో కొండపల్లిలో త్రాగునీటి సరఫరా పనులు చేపడతామన్నారు.
ఈ ప్రాజెక్టు కింద మోగా ఇంజనీర్ కంపెనీ చేపట్టిన పనులకు సంబంధించి చెల్లింపులు, పనుల ప్రగతిని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీని నియమించినట్లు వివరించారు. ఈ కమిటీలో ఈఈ పబ్లిక్ హెల్త్, ఎస్ఈ పంచాయితీ రాజ్, ఎస్ఈఆర్ డబ్ల్యూఎస్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ఇదీ చదవండి