ETV Bharat / state

వలస కార్మికులకు అన్ని సదుపాయాలు సమకూర్చాలి: సీఎం జగన్ - సీఎం జగన్ సమీక్ష వార్తలు

రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలకు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్షించారు. సీఎంఓ అధికారులతో సీఎం ఫోన్లో చర్చలు జరిపారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దని..., మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

cm review on measures taking to send migrant workers to their native places
వలస కార్మికులకు అన్ని సదుపాయాలు సమకూర్చాలన్న సీఎం జగన్
author img

By

Published : May 17, 2020, 2:41 PM IST

రహదారులపై నడుస్తూ వెళ్తున్న వలస కూలీలకు భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివద్దని అధికారులను... సీఎం జగన్ ఆదేశించారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దని ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని స్పష్టం చేశారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదేనని సీఎం సూచించారు.

ఇప్పటివరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై... అధికారులు సీఎంకు వివరాలు అందించారు. కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామని వీరిని తిరిగి బస్సుల్లో పంపించామని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మంది, కృష్ణాజిల్లా నుంచి 16 బస్సుల్లో 410 మంది, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని. గుంటూరు నుంచి 450 మందిని వాళ్ల సొంతూళ్లకు పంపించామన్నారు. భోజనం, ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామనే విషయాన్ని కూలీలకు వివరిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.