ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. జగ్గయ్యపేటలో "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష" పథకం ప్రాంభించనున్నారని వెల్లడించారు. శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నట్లు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, మహిళలు, యువకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు