గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం... గవర్నర్‌తో 40నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం సంఘటన, తదనంతర పరిణామాలు వంటి విషయాలపై చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు ఉన్నతాధికారుల బృందం వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలవాలంటూ గత వారం హైకోర్టు ఆదేశించిన విషయం చర్చకొచ్చినట్లు తెలిసింది. అలాగే రామతీర్థం ఘటనకు సంబంధించి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి కొన్ని ఆధారాలు అందాయని వాటి వివరాలను, ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లినపుడు ఆయన వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ఉన్నారు.
ఇదీ చదవండి
ప్రైవేటు ఆలయాల్లోనే దాడులు.. రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి...