రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించే అంశంతో పాటు ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ జోడింపుపై కార్యాచరణ చేపట్టాల్సిందిగా సీఎం జగన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, ఆ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అరటి, చీని, టమోటా రైతులు ప్రతీ ఏటా గిట్టుబాటు ధరల్లేక నష్టపోవాల్సి వస్తోందని .. వారు పండించిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కష్టాలు పడకూడదని సీఎం అన్నారు.
సంబంధిత పంటల విషయంలో ఆహారశుద్ధి పరిశ్రమల్ని ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే సీజన్ నాటికి ఫుడ్ ప్రాసెసింగ్ కు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ రూపోందించి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆహరశుద్ధి అంశంలో వృద్థి సాధించొచ్చని వెల్లడించారు. ప్రతీ ఏటా అరటి, చీని, టమాటా, ఉల్లి, నిమ్మరైతుల కష్టాలు పడుతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం