సీఎం జగన్ తన సొంత వ్యాపార సంస్థ కోసం జల చౌర్యానికి పాల్పడ్డారని తెదేపా నేత పట్టాభిరాం ధ్వజమెత్తారు. సరస్వతీ ఇండస్ట్రీస్‌కు నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమమని ఆయన ధ్వజమెత్తారు. అక్రమ జల కేటాయింపుల జీవోను తక్షణం రద్దు చేసి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరస్వతీ ఇండస్ట్రీస్ కోసం సీఎం జగన్ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
'కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సరస్వతీ ఇండస్ట్రీస్‌కు రెండు షోకాజ్ నోటీసులు పంపారు. 2014లో జీవో 98 ఇచ్చి మైనింగ్ లీజ్ రద్దు చేశారు. పర్యావరణ అనుమతుల కోసం మైనింగ్ లీజ్ రద్దు చేసిన జీవో 98ని దాచిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుని సైతం తప్పుదారి పట్టించారు. జగన్ తరఫు న్యాయవాది చెప్పిన దానికల్లా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తలాడించారు. ఈ సంస్థ 0.036 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉన్నా... జగన్ సీఎం అయ్యాక 0.068 నీటిని ఎలా కేటాయించారు' -పట్టాభి, తెదేపా నేత
ఇదీ చదవండి