రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నరవుతున్నా పేదలకు నివాస స్థలాలు కేటాయించలేదని మండలి సభ్యుడు, తెదేపా గన్నవరం ఇన్‌ఛార్జ్ బచ్చుల అర్జునుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామదర్శిని పేరిట ఎమ్మెల్సీ అర్జునుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ గ్రామీణ మండలం పాతపాడులో గ్రామదర్శిని ఏర్పాటు చేశారు.
పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వనందుకు 'నా ఇల్లు నా సొంతం - నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి' పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేదలకు స్థలాలు పంపిణీ చేయాలని, గతంలో నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
అలా వ్యవహరిస్తే సహించేదే లేదు..
ఏపీ టిడ్కో నిర్మించిన ఇళ్లు దాదాపు పూర్తయ్యాయని, వాటికి రంగులు వేసి, తాగునీటి సౌకర్యం కల్పిస్తే పేదలు నివాసం ఉండే అవకాశం ఉందన్నారు. కోర్టు వివాదాల్లో లేని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా సహించే ప్రసక్తి లేదని అర్జునుడు హెచ్చరించారు.