దేశ ప్రగతికి నేటి బాలలే... మార్గనిర్దేశకులని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంచి భవిష్యత్తుకు చిన్నతనం నుంచే పటిష్టమైన పునాది అవసరమని విద్యార్థులకు సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని... కష్టపడి వాటిని అందుకోవాలని చెప్పారు. ఆంగ్లేయుల పరిపాలన నుంచి దేశానికి స్వాతంత్య్ర ఫలాలను తీసుకురావటంలో... అనేక మంది మహనీయుల త్యాగం... కష్టం.... పోరాటం ఉందన్నారు.
ఆనాటి దేశభక్తుల ఆశయాలు, ఆలోచనలను అందిపుచ్చుకుని వారి బాటలో పయనించాలని చిన్నారులకు సూచించారు. ప్రపంచంలోనే భారతదేశం శక్తివంతమైనదని.. ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: "మనబడి నాడు-నేడు"కు ఇవాళ సీఎం జగన్ శ్రీకారం