ETV Bharat / state

CM Review : ధాన్యానికి మరింత మద్దతు ధర కల్పించాలి.. వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

author img

By

Published : Apr 24, 2023, 10:12 PM IST

CM Review : ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా నిధులు తొలి విడత ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. అర్హులైన రైతుల జాబితాలను మే 10 వ తేదీ నాటికి ప్రదర్శించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ap cm jagan mohan reddy
ap cm jagan mohan reddy

CM Review : వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. రబీలో ఈ– క్రాప్‌ బుకింగ్ ‌పై సీఎం ఆరా తీశారు.48.02 లక్షల ఎకరాల్లో 97.5 శాతం ఈ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తయిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద జులై నాటికి 500 కిసాన్ డ్రోన్లు, డిసెంబర్‌ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

రైతు భరోసా నిధులు విడుదల చేయాలి.. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా నిధులు తొలి విడత ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను మే 10వ తేదీ నాటికి అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన అధికారులు.. 467 వీఏఏ, 1644 వీహెచ్‌ఏ, 23 వీఎస్‌ఏ, 64 వీఎఫ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 4 వేల 656 ఏనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 7 వేల 233 కోట్లకు గానూ 7వేల 200 కోట్లు చెల్లించామని, ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా 33 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ డబ్బును వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశించారు. రబీ ప్రొక్యూర్‌మెంట్‌కు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని అధికారులు తెలిపారు.

ధాన్యం రసీదులు ఇవ్వాలి.. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని, ఆ రశీదు వెనుక రైతులను ఉద్దేశించి సూచనలు తప్పని సరిగా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలను అందులో తెలపాలన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు 1967 తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని ఆదేశించిన సీఎం.. ఎగుమతులు పెరిగి వారికి మంచి ఆదాయం ఉంటుందన్నారు. రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. 1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా, 206కుపైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయని, మిగిలిన వాటిని జులై కల్లా పూర్తిచేస్తామని తెలిపారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న ప్రక్రియ మరింత సమర్థవంతంగా ముందుకుసాగాలని, ఏటా ఈ పంపిణీ మొత్తం పెరగాలన్నారు.

పంటల ధరలపై సీఎం యాప్‌ ద్వారా వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. నిరంతరం మాక్‌ డ్రిల్‌ చేస్తూ ఈ విధానం పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా రైతులకు కనీస మద్దతు ధర లభించలేని పక్షంలో వెంటనే జోక్యం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.