'వైఎస్సార్ చేయూత' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ఏటా 18,750 రూపాయలు చొప్పున నాలుగేళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. దాదాపు 25 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో ఈ పథకం ద్వారా 18 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. సాయాన్ని నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ
నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటున్నామని లబ్ధిదారులకు రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. 'చేయూత పథకం కింద సాయం పొందిన వారు అమూల్, పీ అండ్ జీ, ఐటీసీ, హెచ్యూఎస్, రిలయన్స్ సంస్థలతో వ్యాపార భాగస్వామ్యం కావాలంటే ఈ ఉత్తరంతో పాటు అందించే ఎంపిక పత్రాన్ని పూర్తి చేసి వాలంటీర్లకు అందించాల'ని కోరారు.
ఇదీ చదవండి