రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలానాల కుంభకోణం నేపథ్యంలో కృష్ణా జిల్లావ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలానాల తనిఖీలు కొనసాగుతున్నట్లు గుడివాడ సబ్ రిజిస్టర్ ఏ. సీతారామాంజనేయులు తెలిపారు.
గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. నాలుగు నెలల కాలానికి(ఏప్రిల్ 21 జూలై) జరిగిన చలానాల లావాదేవీలను పరిశీలించారు. ఈ మధ్యకాలంలో సుమారు పది కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అయితే వాటిలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. త్వరలో ఏడాది క్రితం నుంచి జరిగిన చలానాల లావాదేవీలను కూడా తనిఖీ చేస్తామని అధికార వర్గాలు తెలిపారు.
ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం