ETV Bharat / state

అనిశా వలకు చిక్కిన ఏఈకి... దుండగుడు కుచ్చుటోపి

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి... ఓ దుండగుడి చేతిలో మోసపోయాడు. అవినీతి కేసులో కోర్టులో హజరుపర్చకుండా ఉండేందుకు లక్ష రూపాయలు చెల్లించాలని.... డీఎస్పీ పేరుతో ఆ అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. నిజమేనని నమ్మిన సదరు అధికారి.. డబ్బును ఆన్​లైన్​ ద్వారా చెల్లించాడు. అసలైన ఏసీబీ అధికారులు తనని అరెస్ట్ చేసిన తర్వాత.. మోసపోయానని తెలుసుకున్నాడు. చివరికి.. పోలీసులను ఆశ్రయించిన ఘటన కృష్ణా జిల్లా పెడనలో జరిగింది.

అనిశా వలకు చిక్కిన ఏఈకి... దుండుగుడు కుచ్చుటోపి

author img

By

Published : Mar 22, 2021, 7:26 PM IST

ఏసీబీ డీఎస్పీ పేరుతో ఓ అధికారి నుంచి.. దుండగుడు లక్ష రూపాయలు కాజేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెడనలో ఏఈగా పనిచేస్తున్న ప్రసాద్ లంచం తీసుకుంటూ ఇటీవల అనిశాకు చిక్కారు. ఈ విషయం తెలుసుకున్న ఓ దుండగుడు.. ప్రసాద్ సోదరుడు వెంకట సుబ్బారావుకు ఫోన్ చేశాడు. ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. కోర్టులో హాజరు పరచకుండా ఉండాలంటే.. లక్ష రూపాయలు చెల్లించాలని అడిగాడు. నిజమేనని నమ్మి.. వాళ్లు లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు.

చివరికి.. ఏపీ ప్రసాద్ ను అసలైన ఏసీబీ అధికారులు.. నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అనుమానం వచ్చిన సుబ్బారావు.. తనకు కాల్ వచ్చిన నంబర్ కు ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని స్పందన వచ్చింది. మోసపోయానని గ్రహించిన ఆయన.. పెడన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. మచిలీపట్నంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ ద్వారా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

విజయవాడ కనకదుర్గ ఆలయంలో.. ప్యాకెట్లలో అన్నప్రసాదం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.