ETV Bharat / state

సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూలం.. ఓపీఎస్‌కు సమాన లబ్ధి:చంద్రశేఖర్ రెడ్డి - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్

ChandraSekhar Reddy On CPS cancellation: సీపీఎస్ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలతతో ఆలోచిస్తోందని ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దీంతోపాటు ఉద్యోగుల జీతాల విషయంలో జాప్యం జరుగుతోందన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన ఇకపై ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని అన్నారు. ఇంకా ఏమన్నారంటే?..

చంద్రశేఖర్ రెడ్డి
చంద్రశేఖర్ రెడ్డి
author img

By

Published : Mar 10, 2023, 5:09 PM IST

ChandraSekhar Reddy On CPS cancellation: సీపీఎస్ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలతతో ఆలోచిస్తోందని ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్​లో మాట్లాడిన ఆయన ఓపీఎస్ విధానం ద్వారా కలిగే లబ్ధికి సమానమైన కొత్త విధానంపై ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ఒకటో తేదీన జీతాలు చెల్లించే విషయంలో జాప్యం జరుగుతోందన్న మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. అయితే ఈ నెలాఖరులోగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని, వాళ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్యారోగ్య శాఖలో కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు అదనంగా రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగులు చేరిన కారణంగానే జీతాల భారం పెరిగిందని ఆయన తెలిపారు. రెవెన్యు నెలకు రూ. 1.25 లక్షల మేర ఆదాయం ప్రభుత్వానికి వస్తుంటే, అందులో 90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని ఆయన వెల్లడించారు.

ఈ నెల 16వ తేదీన పీఆర్సీ బకాయిలు చెల్లింపుల విధానంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుందని అన్నారు. ప్రభుత్వం మోసం చేస్తోందని బొప్పరాజు అన్నారని తాము అనుకోవడం లేదని, ఒక్కో సంఘానికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని అన్నారు. బొప్పరాజు కూడా చర్చల్లో సంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని చంద్రశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

"ఈ మధ్య కాలంలో శాలరీల విషయంలో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతోంది. అయితే ఇక నుంచి ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తాము. తెలంగాణలో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పీఆర్సీ బకాయిన చెల్లింపుల విధానంపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఏదోవిధంగా ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేయాలని అనుకుంటున్న కొంతమంది డిస్టబెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కష్టపడి పనిచేస్తున్నారు. ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రికి చేదోడువాదోడుగా ఉండి సపోర్టు చేస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు పోతుంది." - చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగుల సంక్షేమ సలహాదారు

సీపీఎస్ రద్దుపై చంద్రశేఖర్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.