దేశంలో తొలి క్రీడా విశ్వవిద్యాలయమైన దిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి ఉపకులపతిగా నియమితులైన కరణం మల్లీశ్వరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వీసీగా మల్లీశ్వరి నియామకం, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో చారిత్రక విజయం, ఒలింపిక్స్ పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా తెలుగువారంతా సగర్వంగా స్వాగతించిన క్షణాలు గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు. మల్లీశ్వరి సారథ్యంలో మరెంతో మంది క్రీడాకారులు తయారై దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: