ETV Bharat / state

CBN: జగన్​ దళిత ద్రోహి.. ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కాడా..? : చంద్రబాబు - తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Chandrababu fire on jagan : దళితుల అభివృద్ధికి తెలుగు దేశం పార్టీ అమలు చేసిన పథకాలేవీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్సీల సంక్షేమానికి జగన్ ఏమీ చేశాడో చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. దళిత సంక్షేమానికి మేనిఫెస్టో తో పాటు... ప్రతి దళిత గడపకు లబ్ధి చేరేలా తెలుగుదేశం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Apr 28, 2023, 3:52 PM IST

Chandrababu fire on Jagan : యుగానికో రాక్షసుడు పుడతాడు.. జగన్ అలాగే పుట్టాడంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదని ఆయన విమర్శించారు. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడన్నారు. ఏమన్నా అంటే బటన్ నొక్కానంటున్నారన్న చంద్రబాబు... ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా అని నిలదీశారు. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు. జగన్ దళిత ద్రోహి అని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎస్సీ నేతలదేనన్నారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు.. పోలీస్ స్టేషన్‌లోనన్నారు. లోకేశ్ జగన్‌ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దళిత ద్రోహి జగన్ అనే విషయాన్ని బలంగా చెప్పాలని చంద్రబాబు సూచించారు.

దళిత సంఘాలతో ఆత్మీయ సమావేశం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దళిత సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దళిత సంక్షేమంపై మేనిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీలోని ప్రతి దళిత గడపకు తేదీలో చేరేలా తెలుగుదేశం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. దళిత నేతలు.. పార్టీ ఎస్సీ సెల్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టే యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీలకు తెలుగుదేశం చేసినన్ని మంచి పనులు ఇంకెవరూ చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమం కోసం మనం చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలం అయ్యామని, సమావేశం పెట్టుకున్నాం.. అంతా మాట్లాడేసుకున్నామంటే కుదరదని అన్నారు.

జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటుతో.. అంబేడ్కర్ రాజ్యాంగం రాసినా.. దాన్ని అమలు చేయని పరిస్థితి ఉంటే.. తాను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశామన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసి అంటరానితనాన్ని రూపుమాపామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్​ను నిర్వీర్వం చేసిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్క పథకమైనా అమలు చేస్తోందా అని చంద్రబాబు నిలదీశారు.

టీడీపీ హయాంలో 28 పథకాలు.. టీడీపీ హయాంలో ఎస్సీల కోసం 28 ప్రత్యేక పథకాలిచ్చామని, వాటిని ఈ జగన్ ఎత్తేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఆరు వేల కిలోమీటర్ల మేర ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్ వేయించామన్నారు. సబ్ ప్లాన్ నిధులను పక్కాగా ఖర్చు పెట్టామని, ఈ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని మండిపడ్డారు. పేదలకు.. బడుగులకు రాజకీయాన్ని.. అధికారాన్ని చేరువ చేయాలన్నారు. వాస్తవాలకు దగ్గరగా రాజకీయాలు చేయాలన్నారు. వాస్తవాలకు దూరంగా ఉంటూ రాజకీయాలు చేసే పార్టీలకు మనుగడ కష్టమని తెలిపారు. ప్రజల మనోభావాల ప్రకారం పని చేయకుంటే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగించడం కష్టమని చంద్రబాబు అన్నారు.

పిడికెడు ఆత్మగౌరవం కోసం... బహుజన ఆత్మగౌరవ సమితి తలపెట్టిన పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్, పాంప్లేట్​ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు జరుగుతున్న నష్టం, వేధింపులపై బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తెలిపారు. ఈ సందర్భంగా సమితి పోతుల బాలకోటయ్య రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షిబ్లీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో చంద్రబాబు విడుదల చేశారు. బహుజనుల స్వరం వినిపించడం కోసం బాలకోటయ్య చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు.

ట్రైసైకిల్ పంపిణీ.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడికి లక్ష రూపాయలు విలువచేసే ట్రైసైకిల్ పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతుడు.. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు జగ్గంపేట వెళ్లినప్పుడు ట్రై సైకిల్ అడిగాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అతడి యోగక్షేమాలు తెలుసుకొని ట్రై సైకిల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.