ETV Bharat / state

పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. తమాషాలు చేయొద్దని హెచ్చరిక - ఏపీ ప్రధానవార్తలు

babu fire on police
babu fire on police
author img

By

Published : Feb 21, 2023, 10:12 PM IST

Updated : Feb 21, 2023, 11:05 PM IST

22:02 February 21

రోడ్డుకు అడ్డంగా లారీలు ఉంచడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. తమాషాలు చేయొద్దని హెచ్చరిక

chandrababu fire on police : గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులు ట్రాఫిక్ నిలిపి రోడ్డుకు అడ్డంగా లారీలు ఉంచడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు విజయవాడ చేరుకున్నాక పోలీసులు లారీలను తొలగించారు. పట్టాభి ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పోలీసులే ప్రోత్సహించారని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడి రోజే చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని చెప్పారు. బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. గన్నవరం ఘటనపై సమగ్ర నివేదిక విడుదల చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

గన్నవరం హింసాకాండలో బాధితులపైనే కేసులు: గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై విధ్వంసకాండ ఘటనలో బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు మేరకు 60మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీరిలో ప్రముఖంగా గన్నవరం టీడీపీ నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30మంది ఉన్నారు. పట్టాభి సహా మరో 16 టీడీపీ నాయకులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫైల్ చేశారు. అదే విధంగా బోడె ప్రసాద్​తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

నిరసన కొనసాగించిన పట్టాభి భార్య చందన... తన భర్త పట్టాభి ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలపాలంటూ డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్షకు బయల్దేరిన చందనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పట్టాభిని మధ్యాహ్నం గన్నవరం కోర్టుకు తీసుకొస్తామని పోలీసులు వివరించారు. వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరగా.. పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె తన నివాసంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామరాజు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యాన బాధిత కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలకరించారు.. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 21, 2023, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.