భూపోరాట యోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 106వ జయంతి వేడుకలు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు చండ్ర రాజేశ్వరరావు ట్రస్ట్ సభ్యులు... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు.
అనేక భూపోరాటాల ద్వారా పేద ప్రజలకు భూములు దక్కేలా చేశారని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మల్లుపెద్ది రత్నకుమారి కొనియాడారు. అలాంటి మహానుభావులను స్మరించుకుంటూ... అయన ఆశయాలను ముందుకుతీసుకొని వెళ్లేందుకు పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి