ETV Bharat / state

'అసమర్థ పాలన వల్లే కరోనా ఉద్ధృతి.. భవిష్యత్తు ఆందోళనకరమే'

author img

By

Published : Jul 21, 2020, 2:51 PM IST

Updated : Jul 21, 2020, 6:14 PM IST

సీఎం అసమర్ధత వల్ల కరోనా రోజురోజుకు పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తీసుకువెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. సీఎం మాస్కు ధరించకుండా

chandra babu fires on cm jagan
తెదేపా అధినేత చంద్రబాబు

రాజధానిగా అమరావతి తరలిపోకుండా ఏమి చేయాలో అన్ని చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పెట్రోల్​, డీజిల్​ అమాంతం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెప్పిందేంటి.. చేస్తోందేంటి..?

సీఎం అసమర్ధత వల్లే కరోనా రోజురోజుకు పెరుగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇంతవరకు సీఎం మాస్క్ ధరించకుండా.. అందరూ మాస్క్ ధరించకపోతే జరిమానాలు వేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు ప్రభుత్వం చెప్పిన మెనూ ఏంటి..? ఇప్పుడు ఇస్తోందేంటని ప్రశ్నించారు.

ఉడికీ ఉడకని అన్నం, మాడిపోయిన చపాతీ, ఎండిపోయిన ఇడ్లీ, నీళ్ల సాంబారు, కంపుగొట్టే కూరలు రోగులకు ఇస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. డిశ్చార్జ్ అయిన రోగులకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి రూ.50, రూ.100 చేతిలో పెట్టి పంపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని నిలదీశారు.

ఏడాదిలో లక్ష కోట్ల అప్పులు

వైకాపా ఏడాదిలోనే 34 పథకాలు రద్దు చేసి.. లక్ష కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పటికే జీఎస్​డీపీలో అప్పుల నిష్పత్తి 34.6 శాతానికి పెరిగిందన్న ఆయన.. రాబోయే నాలుగేళ్లలో ఎంత అప్పు చేస్తారో అని ఆందోళన కలుగుతుందన్నారు. వైకాపా అమరావతిని చంపేసి.. పారిశ్రామిక వేత్తలను బెదిరించి యువత ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇసుక కొరత సృష్టించి.. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారని ఆక్షేపించారు.

మంత్రిని బర్తరఫ్​ చేయాలి

పట్టుబడిన హవాలా డబ్బు విషయంలో పారిపోయిన ఇద్దరిలో మంత్రి బాలినేని కుమారుడు ఉన్నాడనే వార్తల్లో నిజమెంత అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ హవాలా భాగోతంపై ఈడీతో విచారణ జరిపించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు సాక్ష్యాలతో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్​ విగ్రహ తొలగింపుపై ఆగ్రహం

కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కావాలని తొలగించారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్ బలగాలతో వైకాపా నాయకులు దగ్గరుండి తొలగించారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని నెల్లూరు జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. జిల్లా నేతలందరూ మాట్లాడి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 'చలో కావలి' కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చంద్రబాబుకు బీదా రవిచంద్ర యాదవ్ వివరించారు.

ఇదీ చదవండి:

'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు'

Last Updated : Jul 21, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.