ETV Bharat / state

అర్ధరాత్రి చైన్​స్నాచింగ్​.. వృద్ధురాలిని లాక్కెళ్లిన దొంగ - కృష్ణా జిల్లాలో చైన్​స్నాచింగ్​

Chain snatching: రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి ఇళ్లలో దొంగతనాలు చేస్తూ.. అడ్డొస్తే ప్రాణాలు సైతం తీస్తున్నారు. పెదపారుపూడి మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో... గొలుసుతో పాటు ఆమెను కూడా లాక్కెళ్లాడు. ఇక ఆమె వల్ల కాకపోవడంతో వదిలిపెట్టడంతో దొంగ గొలుసుతో పరారయ్యాడు. వృద్ధురాలికి గాయాలయ్యాయి.

Chain snatching
మహిళ మెడలోనుంచి బంగారు గొలుసు అపహరణ
author img

By

Published : May 10, 2022, 11:18 AM IST

మహిళ మెడలోనుంచి బంగారు గొలుసు అపహరణ

Chain Snaching: కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం పెదపారుపూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించేందుకు యత్నించాడు దొంగ. ఈ క్రమంలా వృద్ధురాలిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తున్న బొమ్మనబోయిన సుశీల అనే మహిళ మెడలోని రెండు వరుసలున్న.. ఆరు కాసుల బంగారు గొలుసును దొంగిలించేందుకు దుండగుడు యత్నించాడు. మహిళ గొలుసును గట్టిగా పట్టుకున్నా వదలని దుండగుడు.. ఇంటి బయట ఉన్న గేటు వరకు ఆమెను లాక్కెళ్లాడు. ఈ పెనుగులాటలో వృద్ధురాలికి పలుచోట్ల గాయాలు కాగా, నాలుగు వేళ్లు తీవ్రంగా కోసుకుపోయాయి.ఇంట్లో పడుకుని ఉన్న తనపై ముసుగు వేసుకున్న ఆగంతకుడు దాడి చేశాడని బాధితురాలు వాపోయారు. పెదపారుపూడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

"రాత్రి రెండున్నర గంటల సమయంలో ఎవరో వచ్చి నా మెడ మీద చెయ్యి వేశారు. నేను మెడలోని తాడును పట్టుకున్నా. అతడు కూడా అదే పట్టుకుని లాగాడు. నేను వదలకపోయే సరికి నన్ను బయట గేటు వరకు అలాగే లాక్కెళ్లాడు. నాకు గాయాలయ్యాయి. చేతి వెళ్లు కోసుకుపోయాయి. నా వల్ల కాలేదు. చైను వదిలేయడంతో లాక్కుని పారిపోయాడు." -బొమ్మనబోయిన సుశీల, బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.