దేశవ్యాప్తంగా 187చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. దింట్లో భాగంగానే కృష్ణా జిల్లాలోనూ తనిఖీలు చేపట్టింది. ఆక్వా రంగంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని... ఎగవేతకు పాల్పడుతున్నారని సీబీఐ గుర్తించినట్లు తెసిలింది. గుడివాడలో ఈ తరహాలో ఋణం తీసుకున్నట్టు సీబీఐ తనిఖీలో బయటపడినట్లు సమాచారం. కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్, ఎస్బీఐ, కెనరా, దేనా, పంజాబ్ బ్యాంకులతో పాటు మరికొన్నింట్లో తనిఖీలు చేశారు. కానీ ఎక్కడెక్కడ తనిఖీలు చేశారనేది పూర్తిగా బయటకు రాలేదు. మీడియా కంట పడకుండా ఈ తనిఖీలు కొనసాగాయి.
ఇదీ చదవండీ... చిత్తూరు జిల్లాకు చంద్రబాబు... పర్యటన సాగనుందిలా...