హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసులపై దర్యాప్తు పూర్తయిందా? కొనసాగుతోందా తెలపాలని ఈడీకి న్యాయస్థానం ఆదేశించింది. పెన్నా ఈడీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్ కేసులో జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు ఈడీ గడువు కోరింది.
జగతి పబ్లికేషన్స్ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసుల విచారణ అక్టోబరు 5కి వాయిదా పడింది.
ఇదీ చదవండి
Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!