ETV Bharat / state

'పథకం ప్రకారం... అమరావతిని చంపేందుకు ప్రయత్నం' - మూడు రాజధానులు

రాజధానిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడ, గుడివాడలో ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

candle rally against government actions on capital amaravati

author img

By

Published : Jan 4, 2020, 10:41 PM IST

'పథకం ప్రకారం... అమరావతిని చంపేందుకు ప్రయత్నం'

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... తెదేపా మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు విజయవాడలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్​ ఓ పథకం ప్రకారం అమరావతిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు.

అర్హత, అనుభవం లేని బీసీజీ, జీఎన్ రావు కమిటీలు ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా నివేదికలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క వైకాపా తప్పా అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలనే డిమాండ్​తో కృష్ణాజిల్లా గుడివాడలో... అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నెహ్రూ చౌక్ నుంచి ఎన్టీఆర్ క్రీడా మైదానం వరకు కొవ్వొత్తులు పట్టుకొని 'సేవ్ అమరావతి.... సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు.... అమరావతి ముద్దు అంటూ యువత, వివిధ సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'

Intro:AP_VJA_66_04_TDP_BONDA_UMA_CANDLE_NIRASANA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ,ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు విజయవాడలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పథకం ప్రకారం అమరావతిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. అర్హత ,అనుభవం లేని బిసిజి మరియు జిఎన్ రావు కమిటీలతో ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా నివేదికలు చేస్తున్నారని మండిపడ్డారు.ఒక్క వైకాపా తప్ప అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. రాజధాని అమరావతిని కొనసాగిస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బైట్... బోండా ఉమామహేశ్వర రావు తెదేపా మాజీ ఎమ్మెల్యే

Body:AP_VJA_66_04_TDP_BONDA_UMA_CANDLE_NIRASANA_AVB_AP10050

Conclusion:AP_VJA_66_04_TDP_BONDA_UMA_CANDLE_NIRASANA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.