Bulls Race in Gopavaram: కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో దీపక్ నెక్స్జెన్ వారి ఆధ్వర్యంలో ఎడ్ల పందేలు సందడిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 50 ఎడ్ల జతలు ఈ పోటీలకు తరలివచ్చాయి. పందేలను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
ఎడ్ల పందేలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా ఎడ్లు తరలిరావడం మరింత ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: Twin Studies: జంటగా పుట్టారు.. గుట్టు విప్పారు!