కరోనా సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని విజయావడలో తెదేపా శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరావు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కరోనా సమయంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదన్నారు.
కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని తమ సాయంగా చెప్పుకొని వైకాపా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ భారీగా పట్టుబడిన నగదుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతి పరిపాలన విధానాలపై రాజ్యాంగ సంస్థలు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: