కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏపీజెన్‌కోకు చెందిన నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన బాయిలర్ యూనిట్‌ను... ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సామర్థ్యం పెంపులో భాగంగా 800మెగావాట్ల యూనిట్‌లోని బాయిలర్ యూనిట్‌ను కమాండ్ సిగ్నల్ ద్వారా వెలిగించి ఉత్పత్తి ప్రారంభించారు. తదుపరి 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రభుత్వం కమిషనింగ్ చేయనుంది. సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల టర్బైన్ యూనిట్ బాయిలర్ కేంద్రాలను ఎన్టీపీసీ నిర్మిస్తోంది. 2020 జూలై నాటికి 19.2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానించేందుకు ఎన్టీపీసీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జెన్‌కో సీఎండీ ఈ బాయిలర్ యూనిట్‌ను ప్రారంభించారు.
ఇదీ చదవండి:అసలేంటా 'బోస్టన్' కన్సల్టింగ్ గ్రూప్..?