కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా తమ ఊరి రహదారులను మూసివేస్తున్నారు. రామన్నపాలెం గ్రామంలో ఇతరులకు ప్రవేశం లేకుండా రహదారికి అడ్డుగా ముళ్ల కంచె వేసి రాకపోకలు నిలిపివేశారు. ముష్టికుంట్ల గ్రామ వాలంటీర్లు కంచె ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. ఆంజనేయపురంలో రహదారిపై ముళ్ల కంచె వేసి గ్రామ యువత రాకపోకలు నిలిపివేశారు. మునుకుళ్ల శివారులో గ్రామస్థులు రోడ్లు దిగ్బంధం చేశారు. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోకి ఇతర గ్రామాల నుంచి వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు మట్టి పోసి రహదారిని మూసివేశారు.
ఇదీ చూడండి: