ఓ యువకుడిని మరో యువకుడు బ్లేడుతో ఛాతిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా పాతపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పామర్తి భార్గవ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నాం తన పెద్దమ్మ కుమారుడు బెజవాడ సాయి, అతడి స్నేహితులు హర్ష, విజయ్‌తో కలిసి కారులో పాతపాడు నుంచి విజయవాడకు బయల్దేరారు. వారు వెళ్తున్న కారుకు అడ్డంగా ద్విచక్రవాహనంపై మహ్మద్, రజాక్, లోకేష్ అనే యువకులు వచ్చారు. ప్రమాదం జరుగుతుందని గ్రహించిన కారులో ఉన్న సాయి... వాళ్లను వారించాడు.
చూసి నడపండని సాయి చెప్పిన మాటలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురికి నచ్చలేదు. అంతే సాయితో ఆ యువకులు గొడవపడ్డారు. చుట్టుపక్కలవారు అక్కడకు చేరి.. వారిని సముదాయించి అక్కడి నుంచి పంపేశారు.
జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న మహ్మద్, రజాక్, లోకేశ్.. తమ స్నేహితులైన రాజ్‌కుమార్, ఇబ్రహీం, అబ్బాస్, ఈశ్వర్‌కుమార్‌ను పిలిపించారు. పాతపాడు సెంటరుకు వచ్చి సాయి, హర్షతో మళ్లీ గొడవకు దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదైంది. ఆగ్రహంతో ఊగిపోయిన రజాక్... భార్గవ్ ఛాతిపై కోశాడు.
ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. మద్యం మత్తులోనే రజాక్, అతని స్నేహితులు గొడవ పడినట్లు తెలుస్తోంది. రజాక్ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాడనీ... అతనికి గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం