ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా... విద్యుత్ చార్జీల పెంపు పై మాట్లాడే వారని, అధికారికంగా విద్యుత్ బిల్లులు పెంచుతున్నామన్న ప్రకటన చేయకుండానే... బిల్లులు వేలకు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఛార్జీలు పెంచనే లేదని ప్రభుత్వం వాదిస్తోందని.... మరి అంత బిల్లులు ఎందుకు వచ్చాయో చెప్పాలని అన్నారు. బిల్లుల చెల్లింపులకు కొంత గడువు ఇస్తామంటున్నారు కానీ.. ఆ బిల్లులను కరెక్ట్ చేస్తామని మాత్రం ఎందుకు చెప్పడం లేదని అన్నారు. ఏ నెలకు ఆ నెల బిల్లులు డివైడ్ చేసి ఉంటే... స్లాబ్లు యూనిట్ ధర తక్కువ వచ్చే అవకాశం ఉండేదని అన్నారు. ఇలా బిల్లులు డివైడ్ చేయకుండా ఒకే బిల్లు ఇచ్చేయడంతో .. వినియోగదారుడు భారీ మొత్తాలను ఈ కష్టకాలంలో చెల్లించాల్సి వస్తోందని, తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచూడండి. కరోనా కదలనంటోంది.. మలేరియా ముంచుకొచ్చింది!