తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి, తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో త్రిభాషా సూత్రం అమలు చేస్తామని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దడం కంటే సానుకూల ప్రచారం చేపట్టాలని అభిప్రాయపడ్డారు. హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజలు ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే మంచిదని పేర్కొన్నారు. శాసన సభ, సచివాలయాల్లో తెలుగు భాష అమలుకు త్వరలో చర్యలు తీసుకుంటామని యార్లగడ్డ తెలిపారు. కార్యాలయాల్లో తెలుగు భాషను వాడేలా కలెక్టర్లు, ఎస్పీలను కోరతామని వెల్లడించారు.
ఇదీ చూడండి : పోలవరం ఎత్తుపై ఎందుకు స్పందించరు?