ETV Bharat / state

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

ఎన్టీఆర్ వైద్య కళాశాల కౌన్సెలింగ్ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతుంది. 550 జీవో సరైన రీతిలో అమలుచేయాలని బీసీ సంఘాలనేతల ఆందోళన చేపట్టారు. రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'
author img

By

Published : Aug 6, 2019, 11:28 PM IST

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'
వైద్య విద్య ప్రవేశాల కోసం జరుగుతున్న సీట్ల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. భర్తీ ప్రక్రియలో 550 జీవో అమలు చేయకుండా బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ బీసీ విద్యార్థి సంఘాల నేతలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. రెండో రౌండులో జరిగిన భర్తీ ప్రక్రియను రద్దు చేసి రీ-కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వైద్య విద్యకోసం విశ్వవిద్యాలయ అధికారులు రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ సమయంలో 550 జీవో అమలు సరైన రీతిలో చేయలేదని బీసీ సంఘాలు ఆందోళనకు దిగటం వలన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. మొదటి విడత జరిగిన సీట్ల భర్తీ ప్రక్రియ నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని.. వాటిపై నిర్ణయం వచ్చాక భర్తీ ప్రక్రియ చేపడతామని వర్శిటీ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : గవర్నర్​తో ఐఎమ్ఏ ప్రతినిధులు, అధికారుల భేటీ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఘనంగా శ్రీ ఉండబండ వీరభద్ర స్వామి రథోత్సవం.

విడపనకల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉండబండ శ్రీ వీరభద్ర స్వామి వారి రథోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వీరభద్రస్వామి వారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు మహా రుద్రహోమం తదితర పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉరవకొండ గవిమఠం ఉత్తరధికారి కరిబాసవ రాజేంద్ర స్వామి, ఆదోని పీఠాధిపతి కల్యాణి స్వామి వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగించి రథంపై ఉంచారు. అనంతరం వేలాది మంది భక్తుల మధ్య స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 06-08-2019
sluge : ap_atp_73_06_virabadra_swamy_radhotsavam_AV_AP10097
cell : 9704532806

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.