హైకోర్టు సహా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోషియేషన్ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెదేపా, కాంగ్రెస్, జనసేన, సీపీఐ,సీపీఎం పార్టీలు, లోక్ సత్తా ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి, పలు ప్రజా సంఘాల నేతలు, మేధావులు, రోటరీక్లబ్ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
బెజవాడ బార్ అసోషియేషన్ న్యాయవాదులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ సభ్యులు హాజరై పోరాట కార్యాచరణపై చర్చించి తీర్మానాలు చేశారు. అమరావతి రక్షించుకునేందుకు న్యాయవాదులు ఎంతో కృషి చేస్తున్నారని తెదేపా ఎంపీ కేసినేని నాని అన్నారు. అమరావతి తరలింపు ప్రకటన అనంతరం 19మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టును తరలించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రపతి ఆమోదం తోనే హైకోర్టు అమరావతి లో ఏర్పాటు చేశారని ..అమరావతిలో హైకోర్టు ఉంచేలా రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుపెట్టాలన్న సీఎం ప్రతిపాదన సరైందికాదని కాంగ్రెస్ ,జనసేన, సీపీఐ, సీపీఎం, పార్టీలు సహా లోక్ సత్తా నేతలు అన్నారు. రాజధాని ఒకేచోట పెట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి