ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఉద్యోగ సంఘాలు తలపెట్టిన సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. నేడు, రేపు దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెకు ప్రజలు సహకరించాలని ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద బ్యాంకు అధికారులు, ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వాలు ప్రకటించే సహాయ పునరావాస కార్యక్రమాలను.. బ్యాంకులే అమలు చేస్తున్నాయన్నారు. వ్యవసాయ, చిన్నతరహా పరిశ్రమలకు.. బ్యాంకులు ప్రాధాన్యత రుణాలను అందంచి సహకరిస్తున్నాయని గుర్తు చేశారు. అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలపై ఆధారపడకుండా.. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ రంగ పాత్రను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.
ప్రజలకు తీవ్ర నష్టం
బ్యాంకులను ప్రైవేటీకరించి కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా.. ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోకపోతే.. దేశవ్యాప్తంగా ప్రజాందోళన తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: