కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్ కారుపై దాడి జరిగింది. దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..