ETV Bharat / state

Azadi Ka Amrit Mahotsav: ప్రత్యర్థి ఎవరైనా.. దండమూడికి "దండం" పెట్టాల్సిందే! - వెయిట్‌ లిఫ్టింగ్‌

దండమూడి రాజగోపాల్‌.. ఆ పేరు వింటేనే ప్రత్యర్థులకు హడల్‌.. బరిలోకి దిగాడంటే ఆయనదే మెడల్.. వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. దండమూడికి వంగి వంగి దండం పెట్టాల్సిందే.. పోటీ పడిన ప్రతిసారీ ఆయన మెడలో దండ పడాల్సిందే.. శ్రమే పెట్టుబడిగా.. ఉత్సాహమే ఊపిరిగా.. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌ పోటీల్లో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాక ఎగురవేసిన శూరుడు. తనదైన పరాక్రమంతో విజయవిహారం చేసి.. ఆంధ్రభీమగా కీర్తి గడించిన ధీరుడు. ఆటగాడిగా అదరగొట్టిన దండమూడి.. వెండితెర భీముడిగా ప్రేక్షక జన హృదయాలనూ గెలిచాడు.

దండమూడి రాజగోపాల్‌
దండమూడి రాజగోపాల్‌
author img

By

Published : Oct 30, 2021, 6:37 PM IST

దండమూడి రాజగోపాల్‌

కృష్ణా జిల్లా నుంచి మొదలుపెడితే.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తఢాఖా చూపించిన క్రీడాదిగ్గజం "దండమూడి రాజగోపాలరావు". ఎలాంటి సౌకర్యాలు, శిక్షణ లేని రోజుల్లోనే... పవర్‌ లిఫ్టింగ్‌లో సంచలనాలు నమోదు చేసిన ఘనుడు. వరుసగా 12 ఏళ్లు మరొకరికి చోటు లేకుండా... వెయిట్‌ లిఫ్టింగ్‌ పతకాలు ఒడిసిపట్టిన యోధుడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో..ఆటల వైపు ఆశగా చూసే యువతకే కాదు.. మల్లయోధులు, బలశాలులకూ ఆయనే రోల్ మోడల్‌. అట్టడుగు నుంచి అంతర్జాతీయ ఆటగాడిగా వినుతికెక్కిన దండమూడి... ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిని పంచే పరాక్రముడు.

వెయిట్ లిఫ్టింగ్‌ యోధుడిగా వెలుగొందిన దండమూడి... పుట్టింది, పెరిగింది పల్లెటూళ్లోనే. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట ఆయన జన్మస్థలం. పొరుగున ఉన్న వానపాముల గ్రామంలో సోదరి ఇంట పెరిగారు. 16వ ఏట వెయిట్‌ లిఫ్టింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. శిష్టా సోమయాజులు, జాస్తి జావయ్య వంటి ఉద్ధండుల శిక్షణతో... అనతి కాలంలోనే రాటుదేలారు. 1938లో జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని... మొదటిసారే ఛాంపియన్‌గా నిలిచారు. ఆ తర్వాత రెండేళ్లకే రాష్ట్ర ఛాంపియన్‌గా అవతరించారు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూసింది లేదు. 1945లో మొదలెడితే... 1958 దాకా వరుసగా 12 ఏళ్లపాటు ఆయన ఉడుంపట్టు నుంచి పతకం చేజారలేదు. 1943 లండన్‌ ఒలింపిక్స్‌ మొదలు... మూడు పర్యాయాలు దేశం తరఫున విశ్వక్రీడలకు ప్రాతినిధ్యం వహించారు. తృటిలో పతకం చేజారినా... తనదైన ప్రదర్శనతో మనసులు గెలిచారు.

1948లో కోల్‌కతా వేదికగా జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని... 'మిస్టర్‌ ఆసియా'గా గుర్తింపు పొందారు. ఈ ఖ్యాతి పొందిన తొలి భారతీయుడు దండిమూడి కావడం విశేషం. ఎవరికీ సాధ్యంకాని సాహస కృత్యాలతోనూ దండమూడి రికార్డులు నెలకొల్పారు. ఛాతీకి గొలుసులు చుట్టి, గట్టిగా గాలి పీల్చి తెంపడం ద్వారా అచ్చెరువొందేలా చేశారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం వ్యవస్థాపకుడిగా వినుతికెక్కిన ఆయన... వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌కు చాలా ఏళ్లపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. విజయవాడలో సొంతంగా వ్యాయామశాల నెలకొల్పడమే కాకుండా... రాష్ట్రవ్యాప్తంగా జిమ్‌ల ఏర్పాటుకు కృషి చేశారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో స్థలం విరాళంగా ఇచ్చి... ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి కారకులయ్యారు. ఇప్పుడు ఆయన పేరిటే ఉన్న మైదానం.. భవిష్యత్ ఆటగాళ్లు తర్ఫీదు పొందడానికి వేదికగా నిలుస్తోంది.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో 'ఆంధ్రభీమ', 'ఇండియన్‌ టార్జాన్‌' సహా అనేక బిరుదులు పొందిన దండమూడి... తనదైన శరీర దారుఢ్యం, సన్నిహితుల ప్రోత్సాహంతో... అనుకోకుండా సినిమాల్లోనూ నటించారు. నర్తనశాల, వీరాభిమన్యు సినిమాల్లో భీముడి పాత్రలో మెప్పించారు. అక్క కుమార్తె అనసూయను పెళ్లాడిన దండమూడికి.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడగా.. మిగిలిన వాళ్లు విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయారు. జీవితాంతం క్రీడాభివృద్ధికి పాటుపడిన దండమూడి రాజగోపాలరావు.. 1981 ఆగస్టు 6న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: రాచరికం వదిలి రాజ్‌పై పోరు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.