రుణమాఫీ జీవో రద్దుపై.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి సున్నావడ్డీ పథకానికీ మంగళం పాడారని ఆరోపించారు. మిగతా రూ.87 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కమిటీలు వేసి కోత విధించి.. రైతులకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏడాది ముందుగానే రైతు భరోసా పథకం అమలు చేస్తోందన్నారు. అక్టోబర్ 15 నుంచి ఒకేసారి 64.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నట్టు తెలిపారు. రైతురుణ ఉపశమనంతో పోలిస్తే... అదనంగా 27.38 లక్షల మందికి లబ్ది కలుగుతుందని వివరించారు.
ఇదీ చూడండి