Assigned Lands Committee visit to Karnataka : అసైన్డ్ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల కమిటీ కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఐదుగురు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఉన్నత స్థాయి బృందం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటన చేపట్టింది. ఇవాళ బెంగుళూరులో కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్. అశోకతో మంత్రులు, ఎమ్మెల్యేల కమిటీ సమావేశమై ఆ రాష్ట్రంలో అవలంబిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకుంది.
వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, తరగతులకు చెందిన, భూమిలేని పేదలకు భూమిని ఇచ్చే అంశం.. తదుపరి ఉత్పన్నమయ్యే పరిణామాలు, తదితర అంశాలపై చర్చించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో భూమిలేని పేదలకు కేటాయించిన భూమి వారసత్వంగా సంక్రమించేలా విధానాన్ని అనుసరిస్తున్నామని, కొన్ని షరతుల మేరకే దాన్ని విక్రయించేందుకు అనుమతిస్తున్నట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్. అశోక ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందానికి వివరించారు.
ఇవి చదవండి :