అశోక్ గజపతిరాజుపై అవినీతి ముద్ర తగదు: లోకేష్ - Ashok Gajapathi Raju is out of print: Lokesh on Twitter
అశోక్ గజపతి రాజు లాంటి గొప్ప వ్యక్తిపై అవినీతి ముద్ర వేయాలని వైకాపా నేతలు ప్రయత్నించడం.. సూర్యుడి మీద ఉమ్మేయాలనుకోవడమే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వేల ఎకరాల భూమిని, సంపదని మాన్సాస్ ట్రస్ట్ కి ఇవ్వడమే కాక.. ఉత్తరాంధ్రలో వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేశారన్నారు. అలాంటి నాయకుడిపై అవినీతి ముద్ర వేయడానికి మనస్సు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అశోక్ గజపతి రాజు పై అవినితి ముద్రవేయడం తగదు:ట్విట్టర్ లో లోకేష్