విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే కరకట్ట మార్గంలోని ఓ పొలంలో గుట్టలుగా పోసిన బూడిద గుమ్మడి దర్శనమిస్తోంది. పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు ఓసారి.. దిగుబడి వచ్చాక ధర లభించక మరోసారి రైతులు నష్టాల పాలయ్యాడు. ఈసారి ఆశించిన దానికన్నా ఎక్కువగా పంట చేతికి రావడం సహా కాయ పరిమాణమూ పెద్దగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు కిలో ఐదు రూపాయల చొప్పున పొలం వద్దే రైతు విక్రయిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల వల్ల 60 టన్నుల బూడిద గుమ్మడికాయలను పొలం వద్దే ఇలా గుట్టలుగా పోశారు. కొనేవారు లేక కాయలు కుళ్లిపోతున్నాయి.
పెట్టుబడి, కూలి ఖర్చు ఇలా వేల రూపాయలు బూడిద అయిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మూడు రూపాయలకే అడుగుతున్నారని రైతు వాపోతున్నాడు.
ఇదీ చదవండి: Covid-19 updates: 62 వేల కొత్త కేసులు.. 1500 మరణాలు