ETV Bharat / state

వీఆర్వో అనుమానాస్పద మృతి కేసులో నిందితుల అరెస్టు

కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వీఆర్వో శ్రీనివాసరావు అనుమానాస్పద మృతి కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మృతుడి చరవాణిని.. నిందితులు ఉపయోగించటంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

Arrest of accused
నిందితుల అరెస్టు
author img

By

Published : Feb 17, 2021, 8:41 AM IST

కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వీఆర్వో శ్రీనివాసరావు అనుమానాస్పద మృతి కేసులో నిందితులను రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఏం జరిగింది..

ఈ నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున శ్రీనివాసరావు రైల్వే వెస్ట్ బుకింగ్ వైపు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి సెల్​ఫోన్​ లాక్కునేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావు ప్రతిఘటించటంతో ఆయనపై దాడి చేశారు. బలంగా వెనక్కు నెట్టటంతో.. కిందపడి తలకు తీవ్రంగా దెబ్బతగలటంతో వీఆర్వో మృతి చెందాడు. నిందితులు చరవాణిని దొంగిలించి పరారయ్యారు. సిమ్​కార్డు మార్చి.. ఆ సెల్​ఫోన్​ను వినియోగించటంతో సిగ్నల్స్​ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. నిందితులు కృష్ణలంకకు చెందిన శ్రీకాంత్, ఓ మైనర్​గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: కత్తితో విచక్షణారహితంగా దాడి.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.