ETV Bharat / state

కృష్ణాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - కృష్ణాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రేపు ఉత్కంఠ వీడనుంది. కృష్ణాజిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్​ఈసీ, ఎస్పీ ప్రకటించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు.

arrangements done for municipal elections counting at krishna district
కృష్ణాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
author img

By

Published : Mar 13, 2021, 6:17 PM IST

కృష్ణాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

కృష్ణాజిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్​కు.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు. నూజివీడులోని ఓట్ల లెక్కింపు, పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు పలువురు పోలీసు అధికారులను నియమించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను గుంటూరుకు పంపనున్నట్లు వెల్లడించారు.

పెడనలో...

కృష్ణా జిల్లాలో 5 చోట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా.. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు మొత్తం కలిపి వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. పెడన పురపాలక సంఘం కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్​ను ఆయన పరిశీలించారు. కౌన్సిల్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో.. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు ఉంటారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ పూర్తి చేసేందుకు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 40 పోలింగ్ కేంద్రాల్లో శాసన మండలి ఎన్నికలు రేపు జరుగుతాయని పేర్కొన్నారు.

నూజివీడులో...

పురపాలక​ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సకల సన్నాహాలు పూర్తి చేసినట్లు నూజివీడు మునిసిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ తెలిపారు. మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందన్నారు. ఒక్కో విడతలో 8 వార్డుల ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ప్రక్రియ ముగుస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

నందిగామలో...

స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని ఇండోర్ స్టేడియంలో.. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం పక్కనే కౌంటింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పంచాయతీ కమిషనర్ జయరాం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థి, ఆయన తరపు ఏజెంటును మాత్రమే లెక్కింపు కేంద్రానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 20 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదట 10 వార్డులకు సంబంధించిన ఓట్లు.. అనంతరం మరో పది లెక్కించనున్నారు. పోలీసు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఏలూరు మినహా...

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్దా 144 సెక్షన్ కొనసాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లకుగాను.. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు మినహా 11 చోట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తుది ఉత్తర్వుల అనంతరం కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఫలితాలు.. హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

మచిలీపట్నం నగపాలకసంస్థ ఎన్నికల లెక్కలు తేలేది రేపే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.