హైకోర్టును ఆశ్రయించిన అర్జున్ దాస్ ... ఎందుకంటే? - అర్జున్ దాస్ మహంత్‌ను హథీరాంజీ మఠం నుంచి మహంత్ పదవి నుంచి సస్పెండ్
హథీరాంజీ మఠం మహంత్ పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ అర్జున్‌దాస్ మహంత్ హైకోర్టును ఆశ్రయించారు. దేవదాయశాఖ కమిషనర్ జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు . తనపై ఉన్న ఆరోపణలను తెలియజేయకుండా, సంజాయిషీ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తనను తొలగించారని పేర్కొన్నారు. మహంత్‌గా కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
హైకోర్టును ఆశ్రయించిన అర్జున్ దాస్